- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాములమ్మకు శాలువా కప్పిన ఎస్పీ
దిశ ప్రతినిధి, నల్లగొండ : శాంతి భద్రతల పరిరక్షణతో పాటు బాధితులకు న్యాయం అందించే అవకాశం ఒక్క పోలీస్ ఉద్యోగం ద్వారానే సాధ్యమని.. అలాంటి పోలీస్ శాఖలో ఉద్యోగం లభించడం చాలా గొప్ప అవకాశమని డీఐజీ, జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జయరాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన డీటీఆర్బీ సీఐ పి. అంజయ్య, ఎస్సైలు మహ్మాద్ సర్దార్, సి.హెచ్. రవి, ఆర్. లచ్చిరాం, ఏఎస్సై సి.హెచ్. చెన్నారెడ్డి, డీపీఓ రికార్డ్ అసిస్టెంట్ పి. రాములమ్మలను శాలువాలతో సత్కరించి వారందించిన సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా డీఐజీ రంగనాధ్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణలో డీటీఆర్బీ సీఐ అంజయ్య సేవలు అద్వితీయమని, అందుకే ఆయన సేవలు మరో సంవత్సరకాలం కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గించే దిశగా ముందుకు సాగుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రమంలో అందుకు అనుగుణంగా కృషి చేస్తున్నామని తెలిపారు. పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు సమాజాభ్యున్నతిలో భాగస్వామ్యం అయ్యి పోలీస్ శాఖ గౌరవం మరింత పెంచాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నర్మద, డీపీఓ ఏ.ఓ. మంజు భార్గవి, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, నాయకులు సోమయ్య, పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.