వరలక్ష్మికి కరోనా ఎఫెక్ట్

by  |
వరలక్ష్మికి కరోనా ఎఫెక్ట్
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : శ్రావణ మాసం మహిళలకు ప్రత్యేకం. ఈ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం మరింత ప్రత్యేకం. ప్రత్యేకతకు తగినట్లు గురు, శుక్రవారాలు మార్కెట్లు కిటకిటలాడాయి. అమ్మకాలకు సమయం కావాలని వ్యాపారులను అధికారులను కోరారు. అందుకు అధికారులు అనుమతించారు. మార్కెట్‌కు జనం కూడా ఎక్కువగా వచ్చారు. కానీ అమ్మకాలు లేక వ్యాపారులు.. కొనుగోలు చేయలేకపోయామని ప్రజలు నిరాశ చెందారు. బంగారు ధర అమాంతం పెరగడంతో పండుగ ‘రూపు’ లేదు. పువ్వులు, పూజా సామగ్రి ధరలు సైతం భారీగా ఉండడంతో పండగ కళ తప్పింది. ఉదయం నుంచి మార్కెట్‌ కళకళలాడినా శ్రావణం చిన్నబోయింది. వరలక్ష్మీ వ్రతం మహిళలకు ప్రత్యేకమైనది.

శుక్రవారం పూజ చేసుకోడానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ధరల తాకిడికి వెనుకంజ వేసినా పూజా సామగ్రి, వస్త్రాలు, బంగారు, వెండి ఆభరణాలు ఎదో అలా కొన్నామనింపించారు. వ్యాపారులు ఆశించిన స్థాయి అమ్మకాలు లేవని నిరాశ చెందారు. కరోనా ఉధృతితో ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే కొన్ని దుకాణాలు నిర్వహిస్తున్నారు. బంగారు, వస్త్ర దుకాణాల సైతం కళ తప్పాయి.


Next Story

Most Viewed