బక్రీద్‌ను ఇలా జరుపుకోవాలి

by Shyam |
బక్రీద్‌ను ఇలా జరుపుకోవాలి
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జిల్లా ప్రజలకు, ముస్లిం సోదరులకు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, రాములు, జిల్లా ఎమ్మెల్యేలు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగానికి ప్రతీక వారు.. బక్రీద్ పర్వదినం ప్రజల్లో సేవాతత్పరత త్యాగనిరతి లాంటి మహోన్నత మానవీయ లక్షణాలు అలవర్చుకోవాలని బక్రీద్ పండుగ ద్వారా అల్లా మానవజాతికి తన సందేశాన్ని ఇచ్చినట్లు వారు తెలిపారు.

కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు అల్లాహ్ మానవ సమాజానికి శక్తి నివ్వాలని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ ఉపద్రవం నుండి మానవజాతిని కాపాడాలని అల్లాహ్ ను వేడుకున్నట్లు తెలిపారు. తెలంగాణ అంటేనే హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీక అని సీఎం కేసీఆర్ మత సామరస్యాన్ని కాపాడుతూ తెలంగాణను ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఆవిష్కరిస్తున్నట్లు వారు గుర్తు చేశారు. ప్రార్థనల సమయంలో ముస్లిం సోదరులు సామాజిక దూరాన్ని పాటించాలని, అత్యంత సురక్షిత వాతావరణంలో బక్రీద్ పర్వదినాన్ని జరుపుకోవాలని వారు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed