గ్రామాన్ని మండలంగా మార్చాలని కొత్తపల్లిలో..

దిశ, మెదక్: కొత్తపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా అభివృద్ధి చేయాలని కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో మెదక్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు, దళిత రత్న అవార్డు గ్రహీత న్యాత మణయ్య పాల్గొని సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మండలాల విభజన జరగాలన్నారు. న్యాయ సమ్మతమైనటువంటి కొత్తపల్లిని మండల కేంద్రం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అంబేద్కర్ యూత్ అధ్యక్షులు న్యాత నిరంజన్, సభ్యులు కిష్టాపురం యాదగిరి, న్యాత యాదగిరి, అబ్రహం, న్యాత చిరంజీవి, ఏలిగే పురుషోత్తం, న్యాత మోహన్, గడ్డం రాజు, మద్దెల సంజీవులు, మండల బిజెపి అధ్యక్షులు వడ్ల సంతోష్ వారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement