నడుకుడలో మాస్కుల పంపిణీ

దిశ, బాల్కొండ: నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం మాస్కూలు, శానిటైజర్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి వల్లం రవి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు సంవత్సరానికి రూ. 6 వేలు నెరుగా ఖాతాలోకి జమ చేశారన్నారు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాలు దేశ ప్రజలకు అందిస్తున్నారు.

ఈ నెల 5న ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరగబోయే రామ మందిరం భూమి పూజ విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బాలకిషన్, నాయకులు నిమ్మల పెద్ద గంగారాం, మోర్తడ్ మహేష్, శ్రీను, చక్రి, నాని, జెల్ల గంగాధర్, రఘపతి రెడ్ది, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement