ఏపీలో మరో 8,555 మందికి పాజిటివ్

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 8,555 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,58,764కు చేరింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా బారిన పడి 67 మంది చనిపోవడంతో, మొత్తం మరణాల సంఖ్య 1,474కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 74,404 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో కోలుకుని 82,886 మంది డిశ్చార్జి అయ్యారు.

Advertisement