జాతీయ రహదారిపై లారీ దగ్ధం

దిశ ప్రతినిధి, మహాబూబ్ నగర్ : నడుస్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి లారీ పూర్తిగా దగ్ధమైన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనివేట జాతీయ రహదారిపై అయ్యప్ప స్వామి దేవాలయం ఎదురుగా శనివారం ఓ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం ఆ మంటలు భారీగా ఎగిపడ్డాయి. దీంతో ఆ లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ లారీకి బళ్లారికి చెందినదిగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement