తృటిలో తప్పిన ప్రమాదం.. వడ్లలోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా

by Shyam |   ( Updated:2021-12-14 00:39:20.0  )
lorry
X

దిశ సిద్దిపేట: వడ్ల లోడ్ తో వెళ్తున్న లారీ ప్రమాద వశాత్తూ బోల్తా పడిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల లోని కొనుగోలు కేంద్రం నుండి సిద్దిపేటకు వస్తున్న లారీ సుమారు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ప్రమాద వశాత్తూ పట్టణంలోని ప్రతిభ కళాశాల ఎదుట బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ కి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రోడ్ పై ధాన్యం బస్తాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అర్ధరాత్రి కావడంతో రోడ్ పై ఎలాంటి వాహనాలు , ప్రజలు కూడా లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story