భ‌ద్రాచ‌లంలో భారీగా గంజాయి ప‌ట్టివేత‌

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి క‌ర్ణాట‌క రాష్ట్రానికి గంజాయి త‌ర‌లిస్తున్న ముఠా స‌భ్యుల్లో ఒక‌రిని భ‌ద్రాచ‌లం పోలీసులు శ‌నివారం ఆరెస్టు చేశారు. కారులో త‌ర‌లిస్తున్న 180 కేజీల గంజాయిని వారు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో సుమారు రూ.27 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని పోలీసులు అంచ‌నా వేస్తున్నారు. మొత్తం ముగ్గురు స‌భ్యుల్లో ఇద్ద‌రు ప‌రారీలో ఉండ‌గా ఒక‌రిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ముగ్గురు నిందితులు కూడా కర్ణాట‌కకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. హైద‌రాబాద్ మీదుగా క‌ర్ణాట‌కకు స‌రుకును చేర్చేందుకు య‌త్నించ‌గా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసుల‌ చాకచక్యంగా అడ్డుకున్నారు.

Advertisement