- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
త్వరలో భారీగా కానిస్టేబుళ్ల నియామకాలు

X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: రాష్ట్రంలో మరోసారి పెద్దఎత్తున కానిస్టేబుళ్ల నియామకాలు చేపడుతామని హోంమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. శుక్రవారం తెలంగాణ పోలీస్ అకాడమీలో 1,162మంది ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ శాంతిభద్రతలకు పెద్ద పెట వేశారని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు ఆదర్శంగా ఉన్నారని, సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రపంచంలోనే హైదరాబాద్ ముందంజలో ఉందన్నారు. త్వరలో పూర్తికానున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ టవర్‌తో నేరాలను నియంత్రిస్తామన్నారు. కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ అకాడమీ ఇంచార్జ్ డైరెక్టర్ కె. శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Next Story