Ganesh Chaturthi 2021: భక్తులకు గమనిక.. ‘ట్యాంక్‌బండ్‌లో పెద్ద విగ్రహాలకే అనుమతి’

by Anukaran |   ( Updated:2021-09-06 04:50:45.0  )
Ganesh Chaturthi 2021: భక్తులకు గమనిక.. ‘ట్యాంక్‌బండ్‌లో పెద్ద విగ్రహాలకే అనుమతి’
X

దిశ, వెబ్‌డెస్క్: వినాయకచవితి పండుగను‌ హైదరాబాద్ మహానగరంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో చాలామంది వినాయకచవితిని ఇంట్లోనే జరుపుకున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో నగరంలో మళ్లీ హడావిడి మొదలైంది. ఇప్పటికే వీధుల్లో మండపాలు వేసిన భక్తులు.. గణపతి విగ్రహాలు సెలెక్ట్ చేసుకోవడంలో నిమగ్నం అయ్యారు. అటు ప్రభుత్వం కూడా ఫెస్టివల్ సజావుగా సాగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది.

ఇందులో భాగంగానే ప్రతి ఏడాది భాగ్యనగరంలో నిమజ్జనానికి కేరాఫ్‌గా నిలిచే ట్యాంక్‌బండ్‌పై విద్యుత్ దీపాలు అమర్చారు. సోమవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. ట్యాంక్‌బండ్‌పై సుందరీకరణ దెబ్బ తినకుండా ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనానికి ప్రత్యేకంగా.. ఆటోమేటిక్ ఐడల్ రిలీజ్ సిస్టమ్‌ను వాడుతున్నామని తెలిపారు. ఈ ఏడాది క్రేన్ల సంఖ్యను కూడా తగ్గిస్తున్నామని.. కేవలం పెద్ద విగ్రహాలకు మాత్రమే అనుమతి ఇస్తామని సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed