ప్రాధాన్యత క్రమంలో భూసేకరణ: రజత్ కుమార్

by Shyam |
ప్రాధాన్యత క్రమంలో భూసేకరణ: రజత్ కుమార్
X

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం, గజ్వేల్ మండలంలోని ముట్రాజ్‌పల్లిలో నిర్మిస్తున్న ఆర్అండ్ఆర్ కాలనీలను మంగళవారం రాష్ట్ర ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తనిఖీ చేశారు. కాలనీ నిర్మాణం గురించి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మ్యాప్ ద్వారా వివరించారు. అనంతరం తుక్కాపూర్ పంప్‌హౌస్ వద్ద మల్లన్నసాగర్ జలాశయ పనులను, దుబ్బాక ప్రధాన కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆ తర్వాత చందలాపూర్ రంగనాయక సాగర్ ఏస్ఈ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ప్రాధాన్యత క్రమంలో డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్లు పద్మాకర్, ముజంమీల్ ఖాన్, ఆర్డీఓలు అనంతరెడ్డి, విజయేందర్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ ఆనంద్, డీఈ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story