హ్యాపీ బర్త్‌డే మై స్టార్: లక్ష్మీ మంచు

by Shyam |
హ్యాపీ బర్త్‌డే మై స్టార్: లక్ష్మీ మంచు
X

ఫిల్మ్ ఇండస్ట్రీలోకి నటవారసత్వంతోనే ఎంట్రీ ఇచ్చినా.. మల్టీ టాలెంటెడ్‌గా నిరూపించుకున్న నటి ‘లక్ష్మీ ప్రసన్న’. ఇక మేము సైతం ద్వారా మనసున్న వ్యక్తిగానూ రుజువు చేసుకుంది. సమాజంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి చేయూతనిచ్చి ప్రశంసలు అందుకుంది. తండ్రి తనను ఎలా పెంచాడో.. తన బిడ్డను అలాగే పెంచుతోంది లక్ష్మీ. సాటి మనుషులకు సహాయం చేయాలని చెప్తూ, తనకు నచ్చిన రంగాల్లో ఇప్పటి నుంచే ‘విద్యా నిర్వాణ’కు ట్రైనింగ్ ఇప్పిస్తున్న లక్ష్మీ.. నిర్వాణ ఆరో పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌గా విష్ చేసింది.

‘నీ రాకతో నా జీవితంలో అవధులు లేని గొప్ప ప్రేమకు నిర్వచనం దొరికింది.. ఎప్పుడూ సున్నితంగా ఉంటూ అందరినీ ఆప్యాయంగా పలకరించే నీ మనసుకు ధన్యవాదాలు.. కేవలం నా జీవితం మాత్రమే కాదు, నువు టచ్ చేసిన ప్రతీ లైఫ్ ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నించే నువ్వు.. నిండు మనసుతో ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నా.. నువ్వు కోరుకున్న విజయాలు వరించాలని ఆకాంక్షిస్తున్నా.. నువ్వే నా సూర్యుడు, నా చంద్రుడు, నా నక్షత్రాలు’ అంటూ కూతురికి స్పెషల్ విష్ చేస్తూ.. స్పెషల్ ఫోటో పోస్ట్ చేసింది లక్ష్మీ ప్రసన్న.

https://www.instagram.com/p/CBdAlNYFvJb/?igshid=10szwkj7dwlnk

Advertisement

Next Story

Most Viewed