- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏయూలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా లక్ష్మీ పార్వతి
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు భార్య లక్ష్మీపార్వతి మరొక బాద్యత స్వీకరించనున్నారు. ఉన్నత విద్యావంతురాలైన ఆమె సాహితీవేత్త కూడాను. ఎన్టీఆర్ ఆత్మకథను గతంలో ఆమె రాసిన సంగతి కూడా తెలిసిందే. ఎన్టీఆర్ భార్యగా వైఎస్సార్సీపీకి మద్దతు తెలపడంతో ఆమెను తెలుగు అకాడమీ ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.
దీంతో విశాఖలో నిర్వహించిన సాహితీ సభల్లో పాలుపంచుకోవడం ద్వారా తన వైదుష్యాన్ని లక్ష్మీపార్వతి ప్రపంచానికి చాటి భాషాభిమానులను అబ్బురపరచారు. అంతే కాదు, ఆమె తెలుగు సాహిత్యం లోతుల్లోకి వెళ్ళి మన సాహిత్యం ప్రపంచంలో ఇపుడు ఏ దశలో ఉంది చెప్పి మరీ భాషాభిమానుల కళ్ళు తెరిపించారు. ఇదిలా ఉండగా లక్ష్మీపార్వతికి విశాఖ రాజధాని అవుతున్న వేళ కొత్త ఉద్యోగం కూడా అక్కడే వచ్చేసింది. అతి పురాతనమైన ఆంధ్రాయూనివర్శిటీలో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఆమెను ఏయూ వీసీ ప్రసాదరెడ్డి ఆహ్వానించారు.
దానికి ఆమె సమ్మతించడమే కాదు, తనకు బోధన అంటే చాలా ఇష్టమని చెప్పారు. తప్పకుండా ఏయూ విద్యార్ధులకు పాఠాలు బోధిస్తానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా, విశాఖ అద్భుత నగరమని, దీన్ని మరింతగా ముఖ్యమంత్రి జగన్ అభివృధ్ధి చేస్తున్నారని లక్ష్మీపార్వతి కొనియాడారు. మొత్తానికి అన్న గారి సతీమణి విశాఖలో అధ్యాపకురాలిగా ఇకపైన దర్శనమిస్తరన్నమాట. ఇప్పటికే తెలుగు అకాడమీ చైర్మన్ గా వైసీపీ ప్రభుత్వం ఆమెను నియమించిన సంగతీ తెలిసిందే.