- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలి’
by Shyam |

X
దిశ, మహబూబ్‌నగర్: రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. జడ్చర్లలోని నవాబుపేట మండలంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో రక్త సేకరణకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడి రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంకులు, ఆస్పత్రుల్లో రక్త నిల్వలు తగ్గిపోయాయని తెలిపారు. ఈ క్రమంలో నవాబుపేట మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ మహబూబ్‌నగర్ వారి సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. లక్ష్మారెడ్డి ప్రారంభించిన ఈ శిబిరంలో దాదాపు 150 మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు.
Tags: MLA Lakshma Reddy, opened, blood donation camp, mahabubnagar, jadcherla
Next Story