- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బిడ్డతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం..

దిశ,మానకొండూరు : తొమ్మిది నెలల పసికందుతో కరీంనగర్‌లోని లోయర్ మానేర్ డ్యాంలో దూకేందుకు యత్నించిన మహిళ లేక్ పోలీసులు రక్షించారు. వివరాలల్లోకి వెళితే.. దుబ్బాక మండలం ధర్మరాజ్ పేట్ గ్రామానికి చెందిన మహిళ కుటుంబ కలహాలు, భర్త ప్రవర్తన తీరుతో విసుగు చెందిన ఆదివారం సాయంత్రం మానేరు డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. సరిగ్గా మెట్లు దిగుతుండగా గస్తీలో ఉన్న లేక్ పోలీసులు గుర్తించి ఆమెను అడ్డుకున్నారు.
ఆ వెంటనే లే అవుట్ పోస్ట్ ఎస్ఐ వి వెంకటరెడ్డికి సమాచారమిచ్చారు. బాధిత మహిళ గతంలో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసింది. దీంతో ఎస్ఐ వి వెంకటరెడ్డి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మహిళను రక్షించిన ఎస్సైతో పాటు కాని స్టేబుళ్ళు అశోక్, కె నవీన్ , హోంగార్డు హుస్సేన్‌ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి అభినందిస్తూ రివార్డులు ప్రకటించారు. తాజా ఘటనతో లేక్ పోలీసులు కాపాడిన ప్రాణాల సంఖ్య 152కు చేరుకుందని కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు.