క్యాంపస్‌లో లవ్ ప్రపోజల్.. డిసిప్లినరీ కమిటీ ఏం చేసింది?

by Sujitha Rachapalli |
క్యాంపస్‌లో లవ్ ప్రపోజల్.. డిసిప్లినరీ కమిటీ ఏం చేసింది?
X

దిశ, ఫీచర్స్ : సినిమాల్లో హీరోలు చాలా ఈజీగా తమ గర్ల్ ఫ్రెండ్స్‌ వద్ద ప్రేమను వ్యక్తపరచడం చూస్తుంటాం. కానీ రియల్ లైఫ్‌లో అలా చేయడం ఎంత కష్టమో వారిని అడిగినా లేదా నిజమైన ప్రేమికులు ఎవరిని అడిగినా చెప్తారు. అయితే ఇక్కడ ఓ యువకుడు.. తన గర్ల్ ఫ్రెండ్‌కు సినిమాటిక్‌గా లవ్ ప్రపోజ్ చేశాడు. అది కూడా కాలేజ్ క్యాంపస్‌లో కావడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

పాకిస్థాన్‌లోని లాహోర్ యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్స్ హదిక జావేద్, షెహ్రియర్ అహ్మద్ మంచి ఫ్రెండ్స్. అయితే ఎప్పటి నుంచో హదికను ప్రేమిస్తున్న అహ్మద్.. తన మనసులోని మాటను చెప్పేందుకు సంకోచిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల తన ప్రేమ విషయాన్ని ఎలాగైనా తనకు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు కాలేజ్ క్యాంపస్‌లో ఇతర స్టూడెంట్స్ అందరూ చూస్తుండగా, మోకాళ్లపై కూర్చొని ఫ్లవర్స్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. వెంటనే హదిక అతడి లవ్ యాక్సెప్ట్ చేయడంతో ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. అలా వారి ప్రేమకు శుభం కార్డు పడింది. ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్‌ను పక్కనున్న స్టూడెంట్స్ రికార్డ్ చేసి షేర్ చేయగా, ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే యూనివర్సిటీ క్యాంపస్‌లో నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ యూనివర్సిటీ స్పెషల్ డిసిప్లినరీ కమిటీ వీరిద్దరినీ బహిష్కరించడం గమనార్హం.

యూనివర్సిటీ సెక్షన్ 9 ప్రకారం.. జనరల్ డిసిప్లిన్ అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అతిక్రమించినందుకు గాను విచారణకు హాజరు కావాలని కమిటీ కోరింది. కానీ వారు హాజరుకాక పోవడంతో సస్పెండ్ చేసింది. ఇక నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు సస్పెండ్ చేయడంపై ‘రిడిక్యులస్ యాక్ట్’ అని కామెంట్లు పెడుతున్నారు. లవర్స్‌ను మాత్రమే కాదు ప్రేమను కూడా బహిష్కరించండని పోస్టులు పెడుతున్నారు.

Advertisement

Next Story