- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రతీకార చర్యలొద్దు.. కార్మికులను విధుల్లోకి తీసుకోండి
దిశ, పటాన్‌చెరు : సమస్యలు పరిష్కరించకుండా కార్మిక వ్యతిరేక చర్యలకు సాయి సర్ఫేస్ యజమాన్యం పాల్పడుతోందని పరిశ్రమ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి సుధీర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో గల సాయి సర్ఫేస్ యజమాన్యం గత కొన్ని రోజులుగా కార్మికులను విధుల్లోకి తీసుకోకుండా మొండి వైఖరి అవలంభిస్తోంది. యాజమాన్యానికి కనువిప్పు కలిగేలా కార్మికులు ప్రతీరోజు గేటు ఎదుట పలు రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కార్మికులు కంపెనీ గేటు వద్ద భోజనాలు చేస్తూ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా యూనియన్ జనరల్ సెక్రెటరీ సుధీర్ మాట్లాడుతూ.. యాజమాన్యం మొండి వైఖరి విడనాడి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని హెచ్చరించారు. యూనియన్ కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడటం యాజమాన్యానికి తగదన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం తన వైఖరిని మార్చుకుని, వెంటనే కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు శివ, శంకర్, లక్ష్మణ్, మల్లేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.