గని ప్రమాదంపై కార్మిక సంఘాల మండిపాటు..

దిశ, వెబ్‌డెస్క్ :

ఆర్కే 5 బీ బొగ్గు గనిలో సంభవించిన పేలుడుపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని.. పేలుడుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

బాధిత కుటుంబాలను సింగరేణి యాజమాన్యం ఆదుకోవాలని కోరారు. కాగా, బుధవారం సాయంకాలం జరిగిన గని ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

Advertisement