- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీ జమ!
దిశ, వెబ్‌డెస్క్: కొత్త ఏడాది ప్రారంభమవుతున్న తరుణంలో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) ఖాతాల్లో 8.5 శాతం వడ్డీని చెల్లించాలని కార్మిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 6 కోట్ల మంది ఉద్యోగుల ఖాతాల్లో వడ్డీ మొత్తాన్ని జమ చేసేందుకు నిర్ణయించినట్టు శాఖా అధికారులు తెలిపారు. ప్రభుత్వం గెజిట్‌లో వడ్డీ రేటును అధికారికంగా తెలియజేసిన తర్వాత ఈపీఎఫ్ఓ ప్రధాన కార్యాలయం ఈపీఎఫ్‌పై రాబడిని చందాదారుల అకౌంట్‌లోకి జమ చేసేందుకు ఆదేశాలను జారీ చేయనుంది.
2020 ఏడాదిలో పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ పీఎఫ్ మొత్తంపై 8.5 శాతం వడ్డీనికి అందిస్తున్నట్టు కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ చెప్పారు. తొలుత 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీని రెండు విడతలుగా ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ తర్వాత మొత్తాన్ని ఒకేసారి జమ చేయాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది.