- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎల్ అండ్ టీ నికర లాభం డౌన్
దిశ, వెబ్‌డెస్క్: మౌలిక రంగ దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం 44.73 శాతం క్షీణించి రూ. 1,410.29 కోట్లకు పడిపోయిందని వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 2,551.67 కోట్లుగా నమోదైనట్టు తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ. 31,034.74 కోట్లతో 12.15 శాతం తగ్గింది. గతేదాది ఇదే కాలంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ. 35,328.45 కోట్లుగా నమోదైంది. ‘
కొవిడ్-19 మహమ్మారి కారణంగా తక్కువ ఆదాయం, ఆర్థిక క్రెడిట్ నిబంధనలు, మెట్రో సేవలకు అంతరాయం వల్ల లాభాల క్షీణత నమోదైందని’ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికానికి కంపెనీ ఈక్విటీ షేర్‌కు రూ. 18 ప్రత్యేక డివిడెండ్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రాబడి బలంగా ఉంది. ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్ వ్యాపారంలో ఉపసంహరణ ద్వారా ఆదాయం భర్తీ అయిందని కంపెనీ పేర్కొంది. ఇక, సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ గ్రూప్ రూ. 28,039 కోట్ల ఆర్డర్లను సాధించింది. ఇది అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 19 శాతం మెరుగుదల నమోదైంది. అయితే, గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 42 శాతం క్షీణించినట్టు కంపెనీ వెల్లడించింది.