కువైట్‌లోని భారత ఎంబసీ కీలక నిర్ణయం

by Anukaran |
కువైట్‌లోని భారత ఎంబసీ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: కువైట్‌లోని భారత ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత రాయబారి, కార్మిక శాఖలకు చెందిన అధికారులు, సంక్షేమ సంఘాల అధ్యక్షులతో ప్రతి వారం సమావేశం నిర్వహిస్తామని ప్రకటించింది. ఇందు కోసం ప్రతి బుధవారం ఓపెన్ ఔజ్ మీటింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

ఈ సమావేశంలో పాల్గొనే ప్రవాసులు ముందుగానే వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచనలు చేసింది. కాగా, కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ప్రవాసులు వచ్చేలా.. భారత దౌత్య కార్యాలయం ప్రాంగణంలోనే ఈ సమావేశం నిర్వహించనున్నారు. రేపటి నుంచే ఈ ఓపెన్ హౌజ్ సమావేశం ప్రారంభం కావడం విశేషం.

Advertisement

Next Story