- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీకు మేమున్నాం.. ఆదివాసీలకు పోలీస్ శాఖ భరోసా..!
దిశ, మణుగూరు : ఆదివాసీ, గుత్తికోయ మహిళలకు పోలీస్ శాఖ భరోసాగా నిలుస్తుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ అన్నారు. మంగళవారం అశ్వాపురం మండలంలోని గొందిగూడెం గ్రామంలో అశ్వాపురం సీఐ సట్లరాజు ఆధ్వర్యంలో స్థానిక ఆశ్రమ పాఠశాలలో కుట్టు మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ సునీల్ దత్, మణుగూరు ఏఎస్పీ శబరీష్ పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత గిరిజనులు వారి సంప్రదాయ నృత్యంతో అలరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆదివాసీ గుత్తికోయ మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.
మహిళలు వంటింటికే పరిమితం కాకుండా సాధికారత దిశగా ముందుకు వెళ్లాలని మాట్లాడారు. ఆదివాసీ మహిళలకు ఎటువంటి ఇబ్బందులు, అవసరాలు ఉన్న పోలీసు శాఖ అండగా నిలుస్తుందన్నారు. స్థానిక వాసంతి క్రియేషన్ సంస్థ సహకారంతో జీవన్ ఆధార్ సొసైటీ వెల్ఫేర్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివాసీ మహిళకు కుట్టుమిషన్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పాయం భద్రమ్మ, బీజీ కొత్తూరు సర్పంచ్ సూరిబాబు, కుట్టు మిషన్ శిక్షణ నిర్వాహకురాలు వాసంతి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.