ప్రధాని మోడీపై కుష్బూ సెటైరికల్ ట్వీట్..

by Shamantha N |
ప్రధాని మోడీపై కుష్బూ సెటైరికల్ ట్వీట్..
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో ప్రధాని మోడీ చేతుల మీదుగా బుధవారం భూమిపూజ జరిగిన సంగతి తెలిసిందే. శ్రీరాముడు జన్మించిన అభిజిత్ ముహూర్తంలోనే భూమి పూజ జరిగింది. ఈ వేడుకను కోట్లాది మంది భారతీయులు తిలకించారు. అయితే, భూమి పూజ అనంతరం కాంగ్రెస్ నేతలు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత, సినీ నటీ కుష్బూ ప్రధాని మోడీపై వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అది కాస్త వైరల్‌గా మారింది. అంతకుముందు కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే తన సోషల్ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్ చేసి ట్వీట్ చేశారు. ఆ ఫోటోను ఉద్దేశించి.. ‘‘ శ్రీరాముడి కంటే పెద్దగా ప్రధాని మోడీ ఉన్నారని.. ఇదే కలికాలం అంటూ’’.. ఆమె తన ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. అందులో ప్రధాని మోడీ బాలరాముడి చేయి పట్టుకుని నడిపించుకుంటు అయోధ్య వైపు వెళ్తుంటాడు. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ అయ్యింది. తిరిగి రాముడిని అయోధ్యలోకి తీసుకెళ్తున్నారని బీజేపీ నేతలు ట్వీట్ చేస్తుంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం విమర్శిస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేస్తున్నారు.

Advertisement

Next Story