శ్రీలంక కెప్టెన్‌గా కుశాల్ పెరీరా..

by Shyam |   ( Updated:2021-05-12 09:23:34.0  )
శ్రీలంక కెప్టెన్‌గా కుశాల్ పెరీరా..
X

దిశ, స్పోర్ట్స్: శ్రీలంక జట్టు కొత్త కెప్టెన్‌గా వికెట్ కీపర్-బ్యాట్స్‌మాన్ కుశాల్ పెరీరాను నియమించారు. త్వరలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్న శ్రీలంక వన్డే జట్టుకు పెరీరా కెప్టెన్‌గా, కుశాల్ మెండిస్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. కాగా, జట్టులోని సీనియర్ ప్లేయర్లైన కరుణ రత్నే, ఆంజిలో మాథ్యూస్, లాహిరు తిరుమానేతో పాటు వికెట్ కీపర్ దినేశ్ చందిమాల్‌ను జట్టు నుంచి తప్పించినట్లు శ్రీలంక క్రికెట్ సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. జట్టులోకి కొత్తగా పేసర్ చమిక కరుణరత్నే, బ్యాట్స్‌మాన్ షిరాన్ ఫెర్నాండో, బినురా ఫెర్నాండోలను తీసుకున్నారు. మే 23 నుంచి 28 వరకు శ్రీలంక జట్టు బంగ్లాదేశ్‌లో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనున్నది. కాగా, కొత్త కెప్టెన్ కుశాల్ పెరీరా శ్రీలంక తరపున 101 వన్డేలు, 47 టీ20లు, 22 టెస్టులు ఆడాడు.

శ్రీలంక జట్టు : కుశాల్ పెరీర (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వైస్ కెప్టెన్), ధనుష్క గుణతిలక, ధనంజయ డి సిల్వా, పాథుమ్ నిస్సాంక, డాసన్ షనక, ఆషెన్ బండారా, వాయిందు హసరంగ, ఇసురు ఉదాన, అకిల ధనంజయ, నిరోషన్ డిక్‌వెల్లా, దుశ్మంత చమీర, రమేష్ మెండిస్, అశిత ఫెర్నాండో, లక్షన్ సందకన్, చమిక కరుణరత్నే, బినారు ఫెర్నాండో, షినార్ ఫెర్నాండో.

Advertisement

Next Story