సీఎంఆర్ఎఫ్‌కు ఎంపీటీసీలు విరాళం

by Ramesh Goud |
సీఎంఆర్ఎఫ్‌కు ఎంపీటీసీలు విరాళం
X

దిశ, వరంగల్: కరోనా వైరస్ బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధికి మహబూబాబాద్ జిల్లా కురవి మండల ఎంపీటీసీలు నెల వేతనాన్ని విరాళంగా అందించారు. ఎంపీపీ గౌరవ వేతనం రూ.10 వేలు, ఎంపీటీసీల గౌరవ వేతనం రూ.5 వేలు, కో ఆప్షన్ సభ్యుడి గౌరవ వేతనం రూ.5 వేలు, మొత్తం కలిపి రూ.1.05 లక్షలను ఎంపీపీ గుగులోతు పద్మావతి రవినాయక్ చేతుల మీదుగా ఎంపీడీఓ ధన్సింగ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దొంగలి నర్సయ్య, ఎంపీటీసీలు దేవేందర్, భోజునాయక్, భాస్కర్, గణేష్, లాలూ, రంజాన్, రవినాయక్, ఎంపీవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

tags: kuravi MPTC, CMRF, coronavirus, donations, MPP, MPDO

Advertisement

Next Story