అలియా తల నరికేస్తా అంటున్న కునాల్.. ఎందుకంటే ?

by Anukaran |
move
X

దిశ, సినిమా : కరణ్ జోహార్ తన పాపులర్ చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’ మళ్లీ స్టార్ట్ చేశాడు. ఈ మేరకు డిజైన్ చేసిన స్పెషల్ ఎపిసోడ్‌కు ‘ఎంపైర్’ మూవీ నటులు కునాల్ కపూర్, ద్రష్టి ధామి, డినో మోరియా హాజరయ్యారు. అయితే షో కంటిన్యూ అవుతుండగా.. అనుష్క శర్మను పెళ్లిచేసుకోవాలని అనుకుంటున్నానని కునాల్ చెప్పడంతో అటెన్షన్ మొత్తం అతడివైపు మళ్లింది. అయితే ఈ విషయం వింటే ఆమె భర్త విరాట్ కోహ్లీ తన తల నరికేస్తాడని ఆందోళన వ్యక్తం చేయడం విశేషం.

‘ఎంపైర్’ మూవీ నటులతో ఫన్ ర్యాపిడ్ ఫైర్ ప్లాన్ చేసిన కరణ్.. వారిని ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్‌తో ఇబ్బందిపెట్టాడు. అలియా భట్, అనుష్క శర్మ, దీపికా పదుకొనే.. ఈ ముగ్గురిలో ఎవరి తలనరుకుతావ్? ఎవరిని పెళ్లి చేసుకుంటావ్? ఎవరిని లాక్ అప్ చేస్తావు? అంటూ ప్రశ్నించాడు. ఆన్సర్ చేసేందుకు కునాల్ ముందుగా ఆందోళన చెందినప్పటికీ, స్పోర్టివ్‌గానే కాబ్టటి ఓన్ స్టైల్‌లో కూల్‌గా సమాధానమిచ్చాడు. ‘అలియా తల నరకాలనుకుంటా. ఎందుకంటే ఆమె అద్భుతమైన నటన పట్ల నేను అసూయపడతాను. అనుష్క శర్మను పెళ్లిచేసుకోవాలనుకుంటా గానీ, ఇది వింటే విరాట్ నిజంగానే నా తల నరికేస్తాడేమో. ఇక దీపికను లాక్ చేయాలనుకుంటా. ఎందుకంటే విలువైన, అందమైన వాటిని లాక్ చేసుకోవాల్సిందే’ అని చెప్పాడు.

Advertisement

Next Story