- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్ రూల్స్ బ్రేక్.. చిక్కుల్లో టీమిండియా క్రికెటర్
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చిక్కుల్లో పడ్డాడు. కోవిడ్ వ్యాక్సిన్‌ను నిబంధనలకు విరుద్ధంగా తన గెస్ట్ హౌస్‌కు తెప్పించుకొని టీకా వేయించుకున్నాడని కుల్దీప్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడిపై కాన్పూర్ మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. 18 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కుల్దీప్ కూడా స్లాట్ బుక్ చేసుకున్నాడు. కోవిన్ యాప్‌లో కాన్పూర్‌లోని గోవింద్ నగర్ జగదీశ్వరన్ ఆసుపత్రిలో వ్యాక్సిన్ కోసం స్లాట్ బుక్ అయ్యింది. అయితే కుల్దీప్ ఆసుపత్రికి వెళ్లకుండా వ్యాక్సిన్‌ను కాన్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ గెస్ట్ హౌస్‌కు తెప్పించుకొని అక్కడే వేయించుకున్నాడు.
దీనికి సంబంధించిన ఫొటోలను స్వయంగా కుల్దీప్ సోషల్ మీడియాలోపోస్టు చేశాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఈ ఫొటోలను కాన్పూర్ జిల్లా అధికారులు చూసి వెంటనే విస్మయానికి గురయ్యారు. వెంటనే కుల్దీప్ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ అలోక్ తివారి విచారణకు ఆదేశించడండంతో అధికారులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు కుల్దీప్ ఎవరి అనుమతితో గెస్ట్ హౌస్‌లో వ్యాక్సిన్ వేయించుకున్నాడు.. అక్కడికి వ్యాక్సిన్ ఎవరు తీసుకొని వెళ్లారనే విషయంపై ఆరా తీస్తున్నారు.