- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని కేయూ విద్యార్థి ఆత్మహత్య
దిశ ప్రతినిధి, వరంగల్ : ఉద్యోగాల కోసం తెలంగాణలో ఓ విద్యార్థి బలిదానం చేసుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయడం లేదని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మార్చి 26న పురుగుల మందు తాగిన కేయూ విద్యార్థి బోడ సునీల్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. వారం రోజుల క్రితం వరకు వరంగల్‌లోని ఎంజీఎం సునీల్ కు చికిత్స చేసిన వైద్యులు.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ప్రాణాలతో పోరాడిన సునీల్ శుక్రవారం ఉదయం మృతిచెందినట్లు కేయూ విద్యార్థులు తెలిపారు.
ఎస్ఐ కావాలని…
సునీల్ స్వస్థలం గూడూరు మండలం టేజావత్ రాంసింగ్ తండా. ఆయనది నిరుపేద కుటుంబం. ఎస్సై కావాలనే లక్ష్యంతో కేయూలో ఉండి ప్రిపేరవుతున్నాడు. ఉద్యోగం సాధించి కుటుంబ పేదరికాన్ని రూపుమాపాలనుకున్నాడు. మరోవైపు విద్యార్థి రంగ సమస్యలపై ఆక్టివ్‌గా ఉంటూ పోరాటం చేసేవాడు. ఈ క్రమంలోనే కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని పురుగుల మందు తాగిన తర్వాత సెల్ఫీ వీడియోలో పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి..