కల్నల్ సంతోష్ బాబు విగ్రహం ఆవిష్కరించిన కేటీఆర్

by Anukaran |   ( Updated:2023-12-17 14:56:27.0  )
Minister-KTR,-Colonel-Santo
X

దిశ, సూర్యాపేట: దేశం కోసం పోరాడి వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌ బాబు విగ్రహాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ఐటీశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. సూర్యాపేట పట్టణంలోని కోర్ట్ చౌరస్తాకు కల్నల్ సంతోష్ బాబు చౌరస్తాగా నామకరణం చేశారు. పది అడుగుల కల్నల్ సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని చూస్తంటే స్వయంగా జవాన్ తిరిగొచ్చినట్టుంది అని కేటీఆర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కల్నల్ కుటుంబ సభ్యులు, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story