మండలిలో కేటీఆర్ ఏమన్నారంటే….

దిశ వెబ్ డెస్క్: శాసన మండలిలో మంత్రి కేటీఆర్ బుధవారం మాట్లాడారు. బకాయిలను కేంద్రం చెల్లించకున్నా హైద్రాబాద్ కార్పొరేషన్ కు తాము నిధులిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. అయినా ఇప్పటి వరకు ఆస్తిపన్ను, నీటిపన్నులను పెంచలేదని ఆయన చెప్పారు. ఇక అక్టోర్ 2 వరకు రాష్ట్రంలో 11వేల పబ్లిక్ టాయిలెట్లను పూర్తి చేస్తామని వెల్లడించారు. త్వరలోనే వార్డు ఆఫీసర్ నియామకాలు చేపడుతామని ఆయన తెలిపారు.

Advertisement