- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిన్న ట్వీట్.. ఈరోజు సమస్యకి పరిష్కారం
దిశ, వెబ్ డెస్క్: కేటీఆర్ ట్విట్టర్ లో చురుగ్గా ఉంటారు. అభిమానులకు దగ్గరగా ఉండటంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ఏదైనా సమస్యని చెప్పుకుంటే పరిష్కరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆదివారం శేఖర్ గౌడ్ అనే యువకుడు ట్విట్టర్ వేదికగా ఒక సమస్యని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు.
దీనిపై స్పందించిన కేటీఆర్ సదరు జిల్లా కలెక్టర్ కి ఈ బాధ్యతలు అప్పగించాల్సిందిగా కేటీఆర్ ఆఫీస్ టీమ్ ని పురమాయించారు. సోమవారానికల్లా జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారులు రంగంలోకి దిగారు. ఇంతకీ ఏమిటా ట్వీట్? ఏమిటా సమస్య? అధికారులు ఏం చేశారు? తెలుసుకోవాలంటే కింద ఉన్న మ్యాటర్ పూర్తిగా చదవాల్సిందే…
కొమరం భీం జిల్లా పెంచికల్ పేట్ మండలంలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన దళిత మహిళ వారం రోజుల క్రితం మరణించింది. గతేడాది ఆమె భర్త కూడా మరణించాడు. దీంతో వారి సంతానమైన ఆరుగురు ఆడపిల్లలు అనాథలుగా మారారు. వారిని ఆదుకోవాలంటూ శేఖర్ గౌడ్ కేటీఆర్ కి ట్వీట్ చేశాడు. స్పందించిన కేటీఆర్ తన టీమ్ కి పని అప్పగించాడు.
కేటీఆర్ టీమ్ ఆ ఆడపిల్లల వివరాలు కనుక్కుని జిల్లా యంత్రంగానికి తెలియజేశారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఆ అమ్మాయిల వద్దకు వెళ్లి వారి రక్షణకు సంబంధించిన చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు జత చేస్తూ కేటీఆర్ కి, శేఖర్ గౌడ్ కి ట్వీట్ చేశారు కేటీఆర్ ఆఫీస్ టీమ్.
@KTRTRS పెంచికల్ పేట్ మండలంలోని ఎల్కపల్లి గ్రామం తోటపల్లి రాజ్యం దళిత SC భూమి లెని నిరుపేద కూలి కుటుంబానికి చెందిన వారు గత సంవత్సరం అనారోగ్యం తో మౄతిచెందగా అతని భార్య కూడా గతవారం రోజుల క్రితం మౄతిచెందగా వీరికి 6 గురు ఆడ పిల్లలు అనాదలయ్యరు,
తల్లి తండ్రి మరణించడంతో దిక్కుతోచని pic.twitter.com/BG4KIs9Qkc— shekargoud (@Rajashe96057079) August 23, 2020