ట్విట్టర్‌ పోస్ట్‌కు స్పందించిన కేటీఆర్

by Shyam |
ట్విట్టర్‌ పోస్ట్‌కు స్పందించిన కేటీఆర్
X

దిశ, మెదక్: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తనను ఆదుకోవాలని ట్విట్టర్‌లో ఓ వ్యక్తి చేసిన విన్నపానికి మంత్రి కేటీఆర్ స్పందించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ శివారులోని సెలిపులో బొలిగామ రాజా‌గౌడ్ అనే వ్యక్తి నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని బాధితుడు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కు విన్నవించి, ఆదుకోవాలని కోరారు. దీనికి మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. దీంతో కొండపాక మండల వైద్యాధికారి అంకయ్య బాధితుడి దగ్గరికెళ్లి పరీక్షలు నిర్వహించారు. తదుపరి చికిత్స కోసం ఆస్పత్రికి రావాలని సూచించారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ అశ్విని, రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ దుర్గయ్య, సర్పంచ్ ఆరెపల్లి మహాదేవ్, తహసీల్దార్ రామేశ్వరరావు, తెలంగాణ జాగృతి నాయకుడు
ప్రశాంత్‌లు కలిసి రాజా‌గౌడ్ ఇంటికి వెళ్లి సహాయం అందజేశారు.

Tags : minister KTR, responded, Twitter post, Patient, doctor, medak
photo : minister KTR



Next Story

Most Viewed