క్రియాశీల విధానాలే పెట్టుబడులకు ఆకర్షణ

by Shyam |
క్రియాశీల విధానాలే పెట్టుబడులకు ఆకర్షణ
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో పెట్టబడులను ఆకర్షించాలంటే క్రియాశీల విధానాలను రూపొందించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని రూపొందించినట్లు గుర్తుచేశారు. శనివారం సీఐఐ ఇండియా 75వ సమ్మిట్‌లో భాగంగా ఆన్‌లైన్‌లో ‘భారత్‌లో ఆధునిక టెక్నాలజీ- స్థానిక, ప్రపంచ స్థాయి నైపుణ్యం, సమన్వయం’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. కొవిడ్-19 సంక్షోభంలోనూ టెక్నాలజీ ద్వారా మారుమూల ప్రాంతాల్లోనే డిజిటల్ సొల్యూషన్స్ అందుతున్నాయన్నారు. ప్రపంచంలోనే అత్యధిక టెక్నాలజీ వర్క్ ఫోర్స్ ఇండియాలో ఉన్నదని, రెండు దశాబ్దాలుగా లీడ్ చేస్తున్నట్లు గుర్తుచేశారు.

ప్రస్తుతం దేశానికి ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ర్, ఇంక్లూజివ్ గ్రోత్ .. ఈ మూడే కావాలని స్పష్టం చేశారు. అన్నిరంగాల్లోనూ సాంకేతిక నైపుణ్యత వినియోగం పెరిగిందన్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు ప్రయోజనకారిగా ఉంది. విద్యలో డిజిటల్ టెక్నాలజీ, ఆన్‌లైన్ రిటెయిల్, రోబోట్ డెలివరీల్లో టెక్నాలజీ వినియోగం పెరిగిందన్నారు. సమర్ధవంతమైన అభివృద్ధిలో 5జీ కీలకమవుతుందన్నారు. మన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రపంచంలో టెక్నాలజీ లీడర్‌గా నిలబడాలన్నారు. తెలంగాణలో ఇప్పటికే ఏఐ, డ్రోన్, బ్లాక్ చైన్, క్లౌడ్ వంటివి అమలు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు.

Advertisement

Next Story