సీఎంకు వారసత్వ సవాల్… కవిత వర్గానికా? కేటీఆర్ వర్గానికా?

by Anukaran |   ( Updated:2021-12-16 08:03:55.0  )
KCR KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో నామినేటెడ్​ పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు మొదలైంది. మరో రెండేండ్లు మాత్రమే పదవీకాలం ఉండటంతో నామినేటెడ్​ పోస్టులన్నీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో చాలా రోజుల నుంచి ప్రగతిభవన్​ చుట్టూ ప్రదక్షణలు చేశారు. ఇప్పుడు మూడు పదవులు ప్రకటించడంతో ఇక నామినేటెడ్​ జాతర మొదలైంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు కొత్త తలనొప్పి మొదలైంది. కేసీఆర్ చుట్టూ ఉండే నేతలతో పాటుగా నామినేటెడ్​పోస్టుల కోసం అటు కేటీఆర్, ఇటు కవిత తన వర్గం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే అనుచరులు తమ నేతలపై ఒత్తిళ్లు చేస్తున్నారు. ఏండ్ల నుంచి వెంట తిరుగుతున్నామని, ఈసారి తమకు అవకాశం కల్పించాలంటూ బయోడేటాలు పట్టుకుని వేడుకుంటున్నారు. ఇదే సమయంలో రాజ్యసభ ఎంపీ సంతోష్​రావు దగ్గర కూడా ఫైరవీలు చేసుకుంటున్నారు. కొంతమంది మాజీ అధికారులు మళ్లీ పోస్టింగ్‌లు, ఏదైనా కార్పొరేషన్లలో అవకాశం కోసం సంతోష్​ దగ్గర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పదవీ విరమణ చేసిన కొంతమంది సంతోష్​ దగ్గర దరఖాస్తు చేసుకుంటున్నారు.

ఎవరికి వారే జాబితాలు

త్వరలోనే నామినేటెడ్​ పోస్టులను మొత్తం భర్తీ చేస్తారని ప్రగతిభవన్​ వర్గల్లో ప్రచారం జరుగుతోంది. దీనిలో కొంత కదలిక కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో తమ అనుచరుల కోసం మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, హరీశ్​రావు, సంతోష్​ వంటి నేతలు ప్రయత్నాలు వేగిరం చేశారు. తాజాగా మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో కేటీఆర్, మరొకరికి హరీశ్​వర్గీయులకు అవకాశం దక్కినట్లు గులాబీ నేతలు చెప్పుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా నేతల్లో అలజడి మొదలైంది. మొన్నటిదాకా ప్రగతిభవన్​చుట్టు తిరిగి ఆశలు వదిలేసుకున్న వారు మళ్లీ బయోడేటాలు పట్టుకుని నేతల దగ్గరకు పరుగులు తీస్తున్నారు. ఇంకో రెండేండ్లు ఉండటంతో ఈ సారి తమకు అవకాశం ఇప్పించాలని బతిమిలాడుకుంటున్నారు. కొంతమంది ఉద్యమనేతలు కూడా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.

తాజాగా పలువురు ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. పదవుల్లో ఉన్నప్పుడు పార్టీకి, నేతలకు విధేయులుగా పని చేసినవాళ్లంతా ఇప్పుడు తమకు చాన్స్​ ఇప్పించాలని కోరుతున్నారు. టీజీఓకు చెందిన ఇద్దరు నేతలు అటు సంతోష్​రావు, ఇటు హరీశ్​దగ్గరకు పరుగు పెట్టారు. మూడేండ్ల కిందటే పదవీ విరమణ చేసినా అప్పటి నుంచి అవకాశం కోసం చూస్తున్నామని, ఈసారి ఎలాగైనా.. ఎందులోనైనా ఇప్పించాలంటూ వేడుకుంటున్నారు. మరోవైపు జిల్లాల నుంచి కూడా ఫైరవీలు మొదలయ్యాయి. కొంతమంది మంత్రులు కూడా తమ వారికి చాన్స్​కోసం ఫైరవీ చేస్తున్నారు. వాళ్లు కూడా కేటీఆర్, కవిత, హరీశ్, సంతోష్​రావులకు సిఫారసు చేస్తున్నారు. తాము నేరుగా సీఎం దగ్గర ఫైరవీలు చేసే అవకాశం లేకపోవడంతో వారసత్వ నేతలను నమ్ముకున్నామంటూ ఓ సీనియర్​నేత బహిరంగంగానే చెప్పుతున్నారు..

TRSకు బిగ్ షాక్… సొంత గూటికి కీలక నేత

Advertisement

Next Story

Most Viewed