సినారె గురించి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Anukaran |   ( Updated:2020-07-29 00:32:03.0  )
సినారె గురించి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ కవి సి. నారాయణ రెడ్డి(సినారె) గురించి మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం బంజారాహిల్స్ లోని సినారె సారసత్వ సదనం నిర్మాణానికి ఆయన శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సినారె గురించి చెప్పడమంటే సాహసమేనని, చిన్నతనంలోనే తనలో ఉన్న కవిని ఆవిష్కరించారని కేటీఆర్ అన్నారు. ఉర్దూపై సినారెకు మంచి పట్టుందని, ఏదైనా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సినారె చెప్పేవారని గుర్తు చేశారు.

సాధ్యమైనంత త్వరగా సినారె ఆడిటోరియం నిర్మాణాన్ని పూర్తి చేసి.. అనంతరం ఆ ఆడిటోరియం కవులకు, కళాకారులకు కొత్త వేదిక అయ్యేందుకు ప్రయత్నిస్తామన్నామని మంత్రి హామీ ఇచ్చారు. సిరిసిల్ల గ్రంథాలయానికి సినారె పేరు పెట్టిన్నట్లు కూడా మంత్రి గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed