KTR: సమస్యలపై నిలదీస్తే అక్రమ అరెస్టులా.. మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్

by Shiva |   ( Updated:2025-01-30 07:22:58.0  )
KTR: సమస్యలపై నిలదీస్తే అక్రమ అరెస్టులా.. మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా సమస్యలపై నిలదీస్తే అక్రమంగా అరెస్టులు చేయడం అన్యాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జీహెచ్ఎంసీ (GHMC) కౌన్సిల్ సమావేశంలో నిరసన తెలిపిన బీఆర్ఎస్ కార్పొరేటర్ల (BRS Corporators)ను అరెస్ట్ చేయడం పట్ల ఆయన సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేటర్లు అరెస్ట్‌ను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ప్రజల తరఫున ఓ ప్రతినిధిగా ప్రశ్నిస్తే.. సభ నుంచి నిర్ధాక్షిణ్యంగా బయటకు పంపుతారా అని ఫైర్ అయ్యారు. అధికార కాంగ్రెస్ (Congress) మోసాన్ని అడ్డుకున్నందుకు గొంతు నొక్కారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ (GHMC) అసమర్థతను ప్రశ్నిస్తే అధికార పక్ష నేతలు ఎందుకు జీర్ణించుకోవడం లేదని అన్నారు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్ల (BRS Corporators)ను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

కాగా, ఇవాళ ఉదయం ప్రారంభమైన జీహెచ్ఎంసీ (GHMC) కౌన్సిల్ సమావేశం రసాభాసాగా మారింది. సభలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) సభ్యల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమావేశం కొనసాగుతోండగానే ప్రశ్నోత్తరాల కోసం బీఆర్ఎస్ (BRS) సభ్యులంతా లేచి నిలబడి నిరసన తెలిపారు. అదేవిధంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి (Mayor Gadwal Vijaya Lakshmi)కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు (BRS Corporators) పోడియం ఎదుటకు వెళ్లి ఆందోళన చేశారు. బడ్జెట్ సమావేశానికి సంబంధించి పేపర్లను విపక్ష సభ్యులు చించేశారు. బడ్జెట్ ఆమోదం తరువాతే ఆమె ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆగ్రహించిన బీఆర్ఎస్ (BRS) నేతలు పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. సభకు ఊరికే అడ్డుపడుతుండటంతో మార్షల్స్‌తో బీఆర్ఎస్ సభ్యులను బయటకు పంపేశారు. దీంతో జీహెచ్ఎంసీ (GHMC) కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ మెరపు ధర్నాకు దిగగా వారిని పోలీసులు అరెస్ట్ చేసిన సమీప పోలీస్ స్టేషన్‌కు తరలిచారు.


Next Story