ప్రభుత్వ ఇండ్ల స్థలాలకు ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందా…

by  |
ప్రభుత్వ ఇండ్ల స్థలాలకు ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందా…
X

దిశ, హుస్నాబాద్: పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలకు ఎల్ఆర్ఎస్ వర్తింస్తుందా అని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నారు. దీనిపై మున్సిపల్,ఐటి శాఖ మంత్రి కేటీఆర్ కు ఆయన సోమవారం లేఖ రాశారు. గతంలో పలు కుల వృత్తులకు, పశులను మేపుకునేందుకు 5ఎకరాల చొప్పున భూమినివ్వగా ఆ స్థలంలో వారు ఇండ్లు నిర్మించుకున్నారని లేఖలో తెలిపారు. వారికి ఎల్ ఆర్ ఎస్ వర్తిస్తుందా అని అడిగారు. వారితో పాటు సాదాబైనామాలు, ప్రభుత్వం పంపిణీ చేసిన ఇండ్ల స్థలాల్లో లబ్దిదారులు కాకుండా మరొక్కరు నివసించడంతో పాటు వ్యవసాయ భూములకు ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందా అని అడిగారు. ఆబాది 10గుంటల స్థలంలో 2గుంటల ఇల్లు కట్టుకోగా, మిగతా 8గుంటల స్థలాన్ని ఎల్ఆర్ఎస్ చేసుకొనే అవకాశం ఉందా అని అడిగారు. ఒకే స్థలాన్ని ఇద్దరికీ అమ్మడం ద్వారా ఆ ఇద్దరూ వ్యక్తులు ఎల్ఆర్ఎస్ కట్టుకుంటే సంబంధిత భూమి ఎవరికి క్రమబద్దీకరించాలనే సమస్య పలు చోట్ల ఎదురవుతోందన్నారు. గృహ యజమాని చనిపోతే అతని భార్యకు, కుమారులు, కుమార్తెలకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లేదా నోటరీ ద్వారా పేరు మార్పిడి చేసే అవకాశం ఉందా అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని సర్వే నెం.266 ఏ అనే, మరో సర్వే నెం. 85 మడద రోడ్డులో పలు కుల పెద్దలకు గతంలో భూములను ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఆ భూములకు ఎల్ఆర్ఎస్ చేసుకునే అవకాశం ఉందా లేదా అనే పూర్తి వివరాలు తెలుపాలని ఎమ్మెల్యే లేఖలో పేర్కొన్నారు.


Next Story

Most Viewed