భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

by Anukaran |   ( Updated:2020-09-28 09:46:28.0  )
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : తెలంగాణ‌లో భూ వివాదాల‌ను శాశ్వ‌తంగా ప‌రిష్కారించాల‌నే సంక‌ల్పంతో కొత్త రెవెన్యూ చ‌ట్టాన్ని ప్ర‌భుత్వం తీసుకువచ్చింద‌ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని రెవెన్యూ స‌మ‌స్య‌ల‌పై హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ స‌మీక్ష సోమవారం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ… పేద, మధ్యతరగతి ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఏమాత్రం లేదని అన్నారు. ఆస్తుల న‌మోదుకు సంబంధించి ద‌ళారుల‌ను న‌మ్మొద్దన్నారు. ఎవ‌రికీ ఒక్క పైసా కూడా ఇవ్వొద్ద‌ని కేటీఆర్ సూచించారు. ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, ఉచితంగా జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు .జీవో నంబర్‌ 58,59 ద్వారా ప్రభుత్వ భూములు, ఎలాంటి వివాదాలు లేని స్థలాలను మాత్రమే రెగ్యులరైజ్‌ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో భూవివాదాలకు పరిష్కారం లభించలేదని అన్నారు. అసైన్డ్‌, యూఎల్‌సీ భూముల్లో వెలిసిన బస్తీలు, కాలనీల్లో కొన్ని ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి సైతం యాజమాన్య హక్కులు లేవని తెలిపారు. వాటి అన్నింటినీ పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed