- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కృనాల్ పాండ్యాను నిర్బంధించిన డీఆర్ఐ!
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ పూర్తయిన తర్వాత ముంబయి జట్టు యూఏఈ నుంచి ముంబయి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముంబయి విమానాశ్రయంలో క్రికెటర్ కృనాల్ పాండ్యాను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు నిర్బంధించారు. అసలు అతడిని ఎందుకు అదుపులోనికి తీసుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం యూఏఈ నుంచి సరైన ధృవపత్రాలు లేని బంగారంతో పాటు ఇన్వాయిస్‌లు లేని వస్తువులు తన వెంట తీసుకొని వచ్చాడంటా.
పరిమితికి మించిన బంగారం ఉండటంతోనే అతడిని నిర్బంధించారు. అతడు మొత్తం రూ. 1 కోటి విలువ చేసే బంగారం, వస్తువులు యూఏఈ నుంచి పట్టుకొని వచ్చాడు. కాగా, కస్టమ్స్ నిబంధనలపై అవగాహన లేకనే ఇలా తీసుకొని వచ్చానని.. భవిష్యత్‌లో ఇలా జరుగకుండా చూసుకుంటానని కృనాల్ హామీ ఇచ్చాడని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. దాదాపు ఆరు గంటలకు పైగా పాండ్యాను అధికారులు ప్రశ్నించారు. చివరకు ఈ వస్తువులు, బంగారానికి సంబంధించి పెనాల్టీ కట్టడానికి కృనాల్ అంగీకరించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతానికి కృనాల్ తెచ్చిన వస్తువులను అధికారులు సీజ్ చేశారు.