- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీకి నీరు.. కృష్ణాబోర్డు గ్రీన్ సిగ్నల్
దిశ, న్యూస్ బ్యూరో: తాగునీటి అవసరాల కోసం ఏపీకి నాగార్జున సాగర్ కుడికాల్వ నుంచి రెండు టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అంగీకరించింది. రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం నెలకొన్న జల వివాదాల నేపథ్యంలో రెండు టీఎంసీలకు త్రిసభ్య కమిటీ ప్రకాశం, గుంటూరు జిల్లాలకు తాగునీటి అవసరాల దృష్ఠ్యా అంగీకారం తెలిపింది. జలసౌధలో శుక్రవారం త్రిసభ్య కమిటీ సమావేశంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. మే నెల వరకు గతంలో చేసిన కేటాయింపులు పూర్తి అయిన నేపథ్యంలో తాగునీటి అవసరాల కోసం 2 టీఎంసీల నీటిని ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది. దీనిపై శుక్రవారం బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం, తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డిలతో కూడిన త్రిసభ్య కమిటీ సమావేశమైంది. మే నెలాఖరుతో నీటి సంవత్సరం ముగుస్తున్నందున అప్పటి వరకు తాగునీటి అవసరాల కోసం రెండు టీఎంసీలను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. ప్రస్తుతం సాగర్లో 510 అడుగుల వరకు నీటిని వినియోగిస్తున్నామని, గతంలో ఆ స్థాయి కంటే దిగువన నీళ్లున్నా తాగునీటి అవసరాల కోసం విడుదల చేశారని ఏపీ ఈఎన్సీ బోర్డుకు వివరించారు.
ప్రస్తుతం తెలంగాణ వాటాలో ఇంకా 49 టీఎంసీల నీరు ఉందని, ప్రాజెక్టులో కూడా నీటి నిల్వ ఉండటంతో సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీకి రెండు టీఎంసీలు విడుదల చేసేందుకు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. మరోవైపు మే నెలాఖరు వరకు జలాల లెక్కలన్నీ పెండింగ్లో పెట్టాలని, తెలంగాణ చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతలతో పాటుగా నీటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ ఈఎన్సీ బోర్డుకు తెలిపారు. అయితే ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలు, పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యం పెంపు అంశాలపై కూడా తెలంగాణ తరుపున వివరించారు. అపెక్స్ కమిటీ సమావేశం ఉండటంతో ఇరు రాష్ట్రాలు ఎజెండా అంశాలపై చర్చించాలని బోర్డు సూచించింది.