కృతి చెప్పిన లైఫ్ ‘సీక్రెట్’

by  |
కృతి చెప్పిన లైఫ్ ‘సీక్రెట్’
X

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్.. లైఫ్‌లో గొప్పగా ఎదగాలంటే ఓ సీక్రెట్ చెప్తానని అంటోంది. సీక్రెట్ అనే ఆడియో బుక్ విన్న కృతి.. వ్యక్తి నుంచి గొప్ప ఔట్‌పుట్ రావాలంటే ఒక విషయం గురించి ‘ఆలోచించాలి, నమ్మాలి, స్పష్టంగా ఆచరించాలి’ అని చెప్తోంది. నేను శక్తిని నమ్ముతానంటున్న భామ.. మనం చేసే ఆలోచన, మాట్లాడే మాటలే మనం దేన్ని అందుకుంటామో నిర్ణయిస్తాయంటూ సెలవిస్తోంది.

https://www.instagram.com/p/CEdt6J3gXHH/?igshid=1hut8wv5ylux8

ప్రతికూల ఆలోచనలు, నిరాశతో ఆలోచిస్తే జీవితంలో ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేమన్న కృతి.. అసలు లైఫ్ ఎందుకింత ఘోరంగా తయారైందో మీకు కూడా అర్థం కాదని అంటోంది. అందుకే సానుకూలంగా ఆలోచించాలని.. ఇతరుల పట్ల దయగా ఉండాలని చెప్తోంది. ‘మన నుంచి రిలీజయ్యే పవరే.. అంతిమంగా మళ్లీ మనల్ని చేరుతుంది. మనం స్వీకరించాలని అనుకుంటున్నదే మనం రిలీజ్ చేస్తున్నామన్న విషయం గుర్తుంచుకోవాలి.. అది పాజిటివ్ అయితే ఔట్‌పుట్ కూడా పాజిటివ్‌గా ఉంటుంది. నెగెటివ్ అయితే నెగెటివ్‌గా ఉంటుంది’ అని చెప్తోంది. కొందరు దీన్ని ‘లా ఆఫ్ అట్రాక్షన్’ అని పిలిస్తే, మరికొందరు ‘కర్మ’ అని పిలుస్తారని చెప్పుకొచ్చింది.



Next Story