అత్యాచార బాధితురాలికి కృష్ణుడు సపోర్ట్ 

దిశ వెబ్ డెస్క్: 139 మంది లైంగికదాడి కేసు ఫైల్ చేసిన యువతి సోమవారం ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి కొన్ని కీలక విషయాలు వెల్లడించింది. తనని 139 మంది రేప్ చేయలేదని, తన ఫ్యామిలీని చంపేస్తానని డాలర్ బాయ్ బెదిరించి కేసును తప్పుదోవ పట్టించాడని బాధితురాలు ఆరోపించింది. డాలర్ బాయ్ ఒత్తిడి వల్లే కేసులో యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడి పేరు చేర్చినట్టు ఆమె తెలిపింది.

ఈ విషయం పై నటుడు కృష్ణుడు స్పందిస్తూ… యాంకర్ ప్రదీప్ తో పాటు నా పేరు మొదట ఎఫ్ఐఆర్ లో చేర్చారు. మాకు ఆ అమ్మాయి ఎవరో కూడా తెలీదు. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఆ బాధితురాలు నిజం మాట్లాడింది. అయితే సెలబ్రిటీలపై ఆరోపణలు రాగానే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసేస్తుంటారు. మాకు కూడా కుటుంబాలు ఉంటాయి. పిల్లలు ఉంటారు.

వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ దూషిస్తుంటారు. మహిళలు ఎవరికైనా ఆపద ఉంటే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోండి అని సూచించారు. దిశ ఘటన తరువాత డయల్ 100 ప్రాముఖ్యత ఏంటో అందరికీ తెలిసింది అన్నారు. బాధితురాలికి మా తరపున ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి మేము రెడీగా ఉన్నామంటూ కృష్ణుడు హామీ ఇచ్చారు.

Advertisement