అదానీ గ్రూపునకు కృష్ణపట్నం పోర్టు..

దిశ, ఏపీ బ్యూరో:

కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టు అదానీ గ్రూప్ దక్కించుకుంది. ఒకటిన్నర నెల తర్వాత కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా అదానీ గ్రూపునకు కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టు లభించింది. దీనికి సంబంధించి ఏపీ కేబినెట్ కూడా ఇందుకు సీల్ అప్రూవల్ మంజూరు చేసింది. ఈ కాంట్రాక్టు విలువ మొత్తం రూ.13,572 కోట్లుగా తెలుస్తోంది.

కృష్ణ పట్నం పోర్టులో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ (APSEZ) సంస్థకు 75 శాతం వాటాను ప్రభుత్వం కేటాయించింది. ఇక నుంచి పోర్టు బాధ్యతలను అదానీ గ్రూపు నిర్వహించే విధంగా NOC ఇచ్చినట్లు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.

Advertisement