టైగర్ ష్రాఫ్‌ను అమ్మాయిల నుంచి కాపాడుకోవాల్సి వచ్చేది!

by Jakkula Samataha |
tiger shroffs sister
X

దిశ, సినిమా : బాలీవుడ్ హ్యాండ్సమ్ టైగర్ ష్రాఫ్‌కు లేడీ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే ఇదంతా చిన్నప్పటి నుంచే ఉందని చెప్తోందని తన సోదరి కృష్ణా ష్రాఫ్. స్కూలింగ్ నుంచి కూడా తన ఫ్రెండ్స్ టైగర్ గురించి మాట్లాడుకునే వారని, హాట్‌గా ఉంటాడని కాంప్లిమెంట్స్ ఇచ్చేవారని, ఆ సమయంలో తనను కాపాడుకోవాల్సి వచ్చేదని చెప్పింది. తను నిజంగా చాలా దయగల వాడని, ఎక్కడ మోసపోతాడో అని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేదాన్నని తెలిపింది. చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని తెలిపిన కృష్ణ.. ప్రతీ విషయాన్ని షేర్ చేసుకుంటామని చెప్పింది. ఏదైనా సలహా కావాల్సి వస్తే ముందుగా అప్రోచ్ అయ్యేది తననే అని, తను కూడా ఫస్ట్ ఇంపార్టెన్స్ తనకే ఇస్తాడని తెలిపింది. ఒక మనిషి మీద వంద శాతం నమ్మకం ఉందంటే, అది టైగర్ ష్రాఫ్ మాత్రమే అని చెప్పింది కృష్ణ. ‘ఇద్దరం ఒకరికొకరం బిగ్గెస్ట్ క్రిటిక్స్, అదే సమయంలో బిగ్ సపోర్ట్ కూడా’ అని బ్రదర్ – సిస్టర్ రిలేషన్ గురించి తెలిపింది.

Next Story

Most Viewed