- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫైనల్ యాక్షన్‌లో ‘క్రాక్’
దిశ, వెబ్‌డెస్క్ : మాస్ మహారాజ రవితేజ ఫైనల్ యాక్షన్‌లోకి దిగుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ‘క్రాక్’ సినిమా ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసేందుకు గోవా పయనమయ్యారు. ఈ విషయాన్ని రవితేజ్ సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ ఫ్లైట్‌లో వెళ్తున్న పిక్ షేర్ చేశారు. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా వస్తున్న ఈ మూవీ సంక్రాంతి బరిలో దిగుతుండగా.. పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ క్రాక్ పర్ఫార్మెన్స్ బాక్సాఫీస్‌ను షేక్ చేయనుందంటోంది మూవీ యూనిట్. రవితేజకు క్రాక్ సక్సెస్ మస్ట్ కాగా.. ఈ సినిమాతో తప్పకుండా సక్సెస్ ట్రాక్‌లోకి వెళ్తాననే ధీమాతో ఉన్నాడు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించగా.. హాట్ గర్ల్ అప్సర రాణి ఐటెం సాంగ్ ‘భూమ్ బద్దల్’ ఇప్పటికే సూపర్ హిట్ అయింది.
ఇక రవితేజ ‘క్రాక్’ ఫిల్మింగ్ పూర్తి కాగానే ఖిలాడి(ప్లే స్మార్ట్) షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. రమేష్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను హవీష్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ నిర్మిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.