- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్రెజిల్ వేరియంట్‌కు కొవాగ్జిన్ చెక్
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా బ్రెజిల్ వేరియంట్‌ను నిలువరించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని తాజా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది. ఇండియన్ డబుల్ మ్యూటెంట్ వేరియంట్, యూకే వేరియంట్‌లనూ కొవాగ్జిన్ నియంత్రిస్తుందని ఇటీవలే తెలిసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో బ్రెజిల్ వేరియంట్‌నూ ఈ టీకా సమర్థవంగా ఎదుర్కొంటున్నదని తేలింది.
కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకన్న తర్వాత బాడీలో యాంటీబాడీలు గణనీయంగా వృద్ధి చెందుతున్నట్టు తెలిసిందని, బ్రెజిల్ వేరియంట్‌నూ ఈ టీకా నిర్మూలిస్తున్నట్టు తేలిందని అధ్యయనం పేర్కొంది. ఇతర వేరియంట్‌లనూ కొవాగ్జిన్ బలంగా ఎదుర్కొంటున్నదని వివరించింది. ఎన్ఐవీ శాస్త్రవేత్తలు గజానన్ సప్‌కాల్, ప్రగ్యా యాదవ్, ప్రియా అబ్రహం, ఇతరులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.