బ్రేకింగ్ న్యూస్.. 'కోటిరెడ్డి గెలుపు లాంఛనమే'

by Sridhar Babu |
kotireddy1
X

దిశ, తుంగతుర్తి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి గెలుపు ఖాయమని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ వెల్లడించారు. నల్లగొండలో మంగళవారం కోటిరెడ్డిని సమర్థిస్తూ కిషోర్ కుమార్ నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అంతేకాకుండా కోటిరెడ్డిని ప్రత్యేకంగా కలిసి.. విజయం ఖాయమంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాయితీని చాటి చెప్పాడని వివరించారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైన తక్కెళ్లపల్లి రవీందర్రావు, సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపిక, రాష్ట్ర నాయకులు గుజ్జ యుగేందర్ రావు, తదితరులు కలిసి అభినందనలు తెలిపారు.

Next Story

Most Viewed