- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చంద్రబాబు భస్మాసురుడి పెద్దన్న: కోటం రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భస్మాసురుడి పెద్దన్న అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాజన్న రాజ్యాన్ని మించిన జగనన్న రాజ్యాన్ని జగన్మోహన్‌రెడ్డి తెచ్చారని కొనియాడారు. అలాంటి జగన్‌ను విఫలనాయకుడైన చంద్రబాబునాయుడు విమర్శిస్తున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్‌ను నరకాసురుడని బాబు విమర్శిస్తున్నారని కోటంరెడ్డి బాధపడ్డారు. బాబు తన ఐదేళ్ల పాలనపై ఆత్మవిమర్శ చేసుకోకుండా జగన్‌ను విమర్శించడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. బాబుది భస్మాసుర హస్తమని ఆయన అన్నారు. అందుకే చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రం మొత్తం తగులబడిపోయిందని ఆయన విమర్శించారు. 40 ఏళ్ల అనుభవమని చెప్పుకునే చంద్రబాబు సుస్థిరపాలనకు కనీసం నాలుగు మంచి సలహాలు ఇచ్చారా? అని ఆయన నిలదీశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి వాటిని చంద్రబాబు వాయిదా వేయించారని ఆయన విమర్శించారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ డ్యామేజీ చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతిపై సిట్ ఏర్పాటు చేస్తే బాబు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. సిట్ ఏర్పాటుతో బాబు, టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఆయన తెలిపారు. జనాదరణలేని జనచైతన్య యాత్రలను బాబు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం కరువు కాటకాలతో బాధపడిందని, జగన్ సీఎం అయ్యాక రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని ఆయన తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక లిటిగేషన్‌లు పెట్టి కోర్టుల ద్వారా ఎన్నికలను చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉండగా బీసీలను అణగద్రొక్కిన బాబు, ప్రతిపక్షంలో ఉండగా కూడా వారిని ఎదగనివ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎవరూ ఇవ్వని జనరంజక పాలనను జగన్ అందిస్తున్నారని ఆయన ప్రశంసించారు.