- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూల్స్ బ్రేక్.. కరోనా వచ్చిన మహిళతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే..
దిశ, పరిగి : వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పులు మహేశ్ రెడ్డి లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే ఏకంగా కరోనా పాజిటివ్ వచ్చిన మహిళకే చెక్కును అందజేసి.. ఫోటోకు ఫోజులు ఇచ్చారు. సభలు, సమావేశాలు పెట్ట వద్దని ప్రభుత్వమే జీవో తీసుకువస్తే ఆ జీఓను ఎమ్మెల్యేలు పాటించకుంటే ఇక సామాన్య ప్రజలు ఎలా పాటిస్తారంటూ తప్పుపట్టారు.
దోమ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో మంగళవారం కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. లాకౌడౌన్‌లో మీటింగ్ పెట్టడమే కాకుండా 75 మందికిపైగా జనాలను ఒకే దగ్గరకు పిలిచి చెక్కులు పంపిణీ చేశారంటూ ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు ఉదయం చెక్కుతీసుకున్న వారిలో ఓ మహిళకు పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కూడా తెలుస్తోంది. సదరు మహిళ తోటి మహిళలతో కలిసి ఉండటం, మాట్లాడటం వల్ల కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని తప్పుపట్టారు.
ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పించాల్సిన ఎమ్మెల్యేనే ఇలా ప్రవర్థించడంపై పలువురు పెదవి విరిస్తున్నారు. పాలకులు జీవోలను పాటించకున్నా.. కనీసం అధికారులైనా పాటించి ఉంటే ఈ సమావేశం జరిగి ఉండేది కాదని ప్రజలు అంటున్నారు.